సస్పెన్స్ .. యాక్షన్ గా వస్తున్న మోహన్ లాల్ ‘ఒడియాన్’!

siri Madhukar
జాతీయస్థాయి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మళియాళ సూపర్ స్టార్ ఈ మద్య వరుస విజయాలు అందుకుంటున్నారు.  ప్రస్తుతం సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన సినిమా  ‘ఒడియన్’పై  మరోసారి భారీ అంచనాలు పెంచుకున్నారు అభిమానులు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమలో మోహన్‌లాల్..చాలా కొత్తరకం  పాత్రలో కనిపించనున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అయిన ‘ఫులి మురుగగన్’ సినిమాను తెలుగులో ‘మన్యం పులి’గా తీసుకొచ్చి ఇక్కడా హిట్ కొట్టాడు మోహన్ లాల్.   ఇప్పటికే విడుదలైన మలయాళ ‘ఒడియన్’ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా తెలుగులో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.  సస్పెన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. 'ఒడియన్ .. వాడు చీకటి రాజ్యానికి రారాజు' అనే డైలాగ్, 'ఇంతవరకూ నువ్వు నన్ను ఎన్నో రూపాల్లో చూసుంటావు .. నువ్వు చూడని రూపం ఒకటుంది' అనే మోహన్ లాల్ డైలాగ్ మరింత ఆసక్తిని రేకెత్తించేలా వున్నాయి. పూర్తిగా మాస్ అవతారంలో రప్ఫాడించాడు మోహన్ లాల్. ఈ చిత్రం కోసం మోహన్ లాల్ 25 కిలోల బరువు తగ్గాడు. భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు.  రళలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ సినిమాని మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో 3డి టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 14న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని దగ్గుపాటి క్రియేషన్స్ సంస్థలో అభిరామ్ దగ్గుపాటి విడుదల చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని మోహన్ లాల్ సొంత నిర్మాణ సంస్థలో వస్తుంది. ఒడియన్ సినిమాలో మంజు వారియర్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: