ఉరివేసుకొని వర్థమాన నటి ఆత్మహత్య!

siri Madhukar
సినిమాల్లో ఛాన్స్ రావడం అంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం పొందుతారు.  ఒక్క చాన్స్ ఇస్తే తామేంటో నిరూపించుకుంటాం అంటూ ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు స్టూడియోల చుట్టూ తిరుగుతూనే ఉంటారు.  కానీ ఎరికో ఒక్కరికే ఆ ఛాన్స్ లభిస్తుంది.  కానీ, వెండితెరపై ఎంత హంగూ ఆర్భాటాలు ఉన్నా..కొంత మంది నటీ,నటుల నిజ జీవితాల్లో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాల భారినుంచి తప్పించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

తాజాగా  కొలీవుడ్‌కు చెందిన వర్దమాన సినీ తార ఆత్మహత్యకు పాల్పడింది. వలసారవాకంలోని తన నివాసంలో నటి రియామికా (26) ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కుంద్రతిలే కుమారనుకు కొండట్టం, అఘోరి యిన్ అట్టం ఆరంభం వంటి సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన రియమిక్క తన సోదరుడు ప్రకాష్ తో కలిసి వలసరవక్కం ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో జీవిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం..తన సోదరి రియామికను చివరిసారిగా మంగళవారం ఉదయం కలిసినట్టు ప్రకాశ్ తెలిపాడు.

అదే రోజు బయటకు వెళ్లిన ప్రకాశ్, తన సోదరికి బుధవారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో భయపడిన ప్రకాశ్ ఆమె స్నేహితుడు దినేశ్‌ను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడని పేర్కొన్నాడు.  ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తన దగ్గర మరో తాళం చెవితో ప్రకాశ్ తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు రియమిక్క నివాసానికి చేరుకొని ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రియామిక ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యంకాలేదని, విచారణలో అన్నీ బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవడానికి విచారణ మొదలుపెట్టారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: