జార్జియాలో చిరంజీవి కోసం అతి జాగ్రత్తతలతో సైరా టీమ్ !

Seetha Sailaja
‘సైరా’ యూనిట్ జార్జియా వెళ్ళి చాల రోజులైంది. అక్కడ ఎత్తైన కొండల మధ్య అందమైన లోకేషన్స్ లో టెంట్లు వేసి షూటింగ్ కోసం నానా హడాదావిడి చేస్తున్నారు. అయితే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించ వలసిన షూటింగ్ స్పాట్ కు ఇంకా చిరంజీవి చేరుకోకపోవడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి ఇంకా జార్జియా వెళ్ళకుండా రామ్ చరణ్ బోయపాటిల  కాంబినేషన్ లో ప్రస్తుతం అజర్ బైజాన్ దేశంలో చిత్రీకరింప బడుతున్న మూవీ షూటింగ్ స్పాట్ లో ఉండి నిన్న సాయంత్ర్రం షూటింగ్ ప్యాకప్ చెప్పే వరకు అక్కడే ఉన్నట్లు టాక్. అంతేకాదు మరో రెండు మూడు రోజులు చిరంజీవి అక్కడే ఉంది చరణ్ సినిమాకు సంబంధించి తీసుతున్న షూటింగ్ సన్నివేశాల గురించి తన సలహాలు అందిస్తాడని తెలుస్తోంది. 

ఆతరువాత మాత్రమే చిరంజీవి ‘సైరా’ షూటింగ్ కోసం జార్జియా వెళతాడట. ప్రస్తుతం జార్జియాలో ఎలాంటి షూటింగ్ జరగడంలేదు అని తెలుస్తోంది. కేవలం రిహార్సల్స్ మాత్రమే జరుగుతున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విటేకర్ ఆధ్వర్యంలో యుద్ధ సన్నివేశాలకు సంబంధించి రిహార్సల్స్ ప్రారంభించారు. అంతా సజావుగా సాగుతుందని నిర్థారించుకున్న తర్వాత మాత్రమే చిరంజీవి వెళతాడని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా జార్జియాలో చిరంజీవి సుమారు 20 రోజులు ఉంటున్న నేపధ్యంలో అతడి గురించి ‘సైరా’ టీమ్ కనీవి ఎరుగని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి తీసుకునే ఆహారంలో ఎటువంటి మార్పులు రాకుండా ఆయన ఆరోగ్యం కాపాడే నిమిత్తం ఆరుగురు చెఫ్ లను ఏర్పాటుచేస్తున్నారట. వారంతా చిరంజీవికి కావలసిన ఇండియన్ వంటకాల్ని సిద్ధం చేస్తూ ఉంటారట. జార్జియా దేశంలో ఎత్తైన కొండల ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది కాబట్టి చిరంజీవికి అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రత్యేకమైన ఫిజికల్ ట్రైనర్ తో పాటు ఒక వైద్యుడుని కూడ చరణ్ అందుబాటులో ఉంచాడట. దీనితో చరణ్ చిరంజీవి పట్ల తీసుకుంటున్న అతి జాగ్రత్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: