హాట్ టాపిక్ గా మారిన మహేష్ బాకీల వ్యహారం !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన సినిమాల ఎంపిక విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు తన పాత బాకీలను క్లియర్ చేసుకునే విధంగా మారాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం దాదాపు నలుగురు నిర్మాతల అడ్వాన్సులు మహేష్ వద్ద పెండింగ్ పడటంతో అవి బాకీలుగా మారి మహేష్ వరసగా తీర్చవలసిన పరిస్థుతులు ఏర్పడుతున్నాయి అని టాక్.

వాస్తవానికి మహేష్ నిర్మాతల వద్ద తీసుకున్న ఈ అడ్వాన్స్ లు ఇప్పటివి కావు. దాదాపు 5 సంవత్సరాల క్రితానికి సంబంధించినవి అని అంటున్నారు. ఆ బాకీలలో భాగంగానే ప్రస్తుతం మహేష్ అశ్వినీదత్ ను తన 25వ సినిమాను తీస్తున్న ముగ్గురు నిర్మాతలలో ఒక నిర్మాతగా అశ్వినీదత్ ను మార్చాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. 

ఇప్పుడు ఈ బాకీల విషయంలో త్వరలో నిర్మాత కె.ఎస్.రామారావును మహేష్ క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 6ఏళ్ల క్రితం కె.ఎస్.రామారావు దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ఇప్పటికీ క్లియర్ కాక పోవడంతో తన 26వ సినిమాగా ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చే ఏడాది సినిమాను చేయడానికి లైన్ క్లియర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఇలాంటి లిస్టులో మరో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కూడ ఉన్నట్లు టాక్. వీరిలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఒకడు అని అంటున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ సినిమా చేయకపోయినా అతడి సొంత బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని మహేష్ ఎప్పుడో మాట ఇచ్చి అతడి వద్ద కూడ అడ్వాన్స్ తీసుకున్నాడు అని అంటున్నారు. దీనికితోడు మహేష్ నిర్మాత కె.ఎల్.నారాయణతో సినిమా కూడ చేయవలసి ఉంది. ఇలాంటి స్థితిలో అల్లు అరవింద్ మహేష్ తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు ప్రముఖంగా లేటెస్ట్ వస్తున్న నేపధ్యంలో మహేష్ అరవింద్ దగ్గర కూడ అడ్వాన్స్ తీసుకున్నాడా అంటూ జోక్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా మహేష్ తాను నిర్మాతల వద్ద ఎప్పుడో తీసుకున్న అడ్వాన్స్ లు బాకీలుగా మారడంతో వాటిని తీర్చే పనిలో బిజీగా ఉన్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: