
కీలక సమయంలో జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా..
మహిళకు జగన్ ఎంతో అండగా ఉన్నారని, ఆ కారణంగా వారందరూ రాత్రి వరకు క్యూలో నిలబడి తమకే ఓటు వేశారని ఆమె తెలిపారు. ఇక వృద్ధుల ఓట్లు కూడా తమకే పడి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014 టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో కూటమిగా ఏర్పడి గెలిచాయని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన మేలు ఏదీ లేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు కాదు కదా వారు ఎప్పుడూ కూడా ఏపీకి మంచి చేయరని, అందువల్ల వారిపై ప్రజలకు ఎలాంటి నమ్మకం లేదని తెలిపారు. ఈ విషయం అందరికీ తెలిసిందే అని కూడా ఆమె చురకులు అంటించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ తెగ ప్రయత్నించిందని ఆమె విమర్శలు చేశారు. చంద్రబాబు ఇలాంటి ఎన్నో దొంగాటలు ఆడారని కానీ అవన్నీ జగన్ మోహన్ ను ఏమీ చేయలేవని కామెంట్లు చేశారు. చంద్రబాబును పుట్టించిన ఖర్జూర నాయుడు వచ్చినా జగన్ ఓడించలేరు అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల మనసుల్లో నుంచి వైఎస్ జగన్ ఎవరు దూరం చేయలేరని కూడా ఆమె కామెంట్లు చేశారు. రోజా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆమె తన విజయం గురించి అలాంటి కామెంట్లు చేసుకోవడం విశేషం ఈసారి ఆమె ఓడిపోవచ్చు అని పలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరా మస్తాన్ కూడా రోజా గెలవరు అని తన అంచనా బయట పెట్టారు.