నగరవాసులకు కూల్ కూల్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ ఐస్ క్రీమ్స్ గిఫ్ట్…!

Edari Rama Krishna
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో నాని స్నేహితుడిగా అద్భుత నటన ప్రదర్శించాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ..సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’తో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో క్రేజీ స్టార్ గా మారిన విజ‌య్ దేవ‌రకొండ ఈరోజు త‌న పుట్టిన రోజును జ‌రుకుంటున్నాడు.. ఈ సంద‌ర్భంగా అత‌డికి ప‌లువురు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.  ఈ మద్య సినిమా ప్రమోషన్లు చాలా చిత్ర విచిత్రంగా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయ్ తన పుట్టిన రోజు వేడుకను వినూత్నంగా జరుపుకుంటున్నాడు.  న‌గ‌రంలో ఎండ‌లకి అల‌మ‌టిస్తున్న వారికి ఐస్‌క్రీమ్స్ అందించి వారిని కూల్ చేసేందుకు బ‌ర్త్‌డే ట్ర‌క్‌ల‌ని ఏర్పాటు చేశాడు.. త‌న ట్విట్ట‌ర్‌లో వాటికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశాడు.  అవి సిటీ అంతా తిరుగుతూ ట్రాఫిక్ పోలీసులు, చిరు వ్యాపారులు, స్టూడెంట్స్, ఉద్యోగులు ఇలా అందరికీ ఉచితంగా ఐస్‌క్రీమ్స్ అందిస్తున్నాయి. అంతే కాదు మీకు ఎక్కడైనా నా బర్త్ డే ట్రక్ కనిపిస్తే..ఏమాత్రం మొహమాటం పడకుండా ఐస్ క్రీమ్ తీసుకోండి..హాయిగా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఫొటోలను నాకు షేర్ చేయండి.

మీకు ముఖాల్లో ఆనందాన్ని చూస్తే నేను హ్యాపీగా ఫీలవుతానంటూ’ హీరో విజయ్ తన ట్వీట్లలో రాసుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన ‘మహానటి’ చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. త్వరలో టాక్సీవాటా రిలీజ్ కి సిద్దంగా ఉంది.  త‌ర్వాత పరశురాం డైరక్షన్ లో గీతా గొవిందం సినిమా చేస్తున్నాడు విజయ్. భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు ఇక తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతున్న నోటా ఈమూవీ షూటింక్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్ దేవరకొండకు ఏపిహెరాల్డ్.కామ్ తరుపు నుంచి శుభాకాంక్షలు.
A few days of shooting in the Sun made me think of this.

What if I got 3 ice cream trucks to drive around the city and give out free ice cream to everyone going about their day in the heat. The traffic cops, the street vendors, students, employees. pic.twitter.com/tisrb8Ot6m

— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: