శ్రీరెడ్డిని తిట్టమని చెప్పింది నేనే!

Edari Rama Krishna
గత నెల రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) పై నటి శ్రీరెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే మొదట్లో ఇది పెద్దగా సీరియస్ గా తీసుకోక పోయినా..‘మా’ అసోసియేషన్ తనకు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత శ్రీరెడ్డి విషయం నేషనల్ స్థాయికి వెళ్లడంతో ఇక్కడి మహిళా సంఘాలు, విద్యార్థ సంఘాలు ఆమెకు మద్దతు పలకడం ప్రారంభించారు.

ఇదిలా ఉంటే..మొన్న శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని తిట్డడంతో ఉద్యమం కాస్త పక్కదారి పట్టిందని..శ్రీరెడ్డిని టార్గెట్ చేసుకొని పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో ఆలోచనలో పడ్డారు శ్రీరెడ్డి. ఇదిలా ఉంటే..క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంగీకరించాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా ఉద్యమం ప్రజల్లోకి వేగంగా వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఆ సలహా ఇచ్చానన్నాడు.

ఈ విషయంలో పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నాడు. ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పవన్ కళ్యాన్ ని సభా ముఖంగా బండ బూతులు తిట్టినా..ఈ మద్య వారు కలిసి మెలిసి తిరగడం ఇద్దరూ కలిసి భోజనం చేశారని గుర్తు చేశాడు. రాజకీయ నేతలు చేసే పనినే తాను చేశానని పేర్కొన్నాడు. పవన్‌ను విమర్శించడం ద్వారా మహేశ్ కత్తి పాప్యులర్ అయ్యాడని శ్రీరెడ్డికి చెప్పానని వర్మ పేర్కొన్నాడు.

అయితే పవన్ కళ్యాన్ గొప్ప మనిషి అని..ఆయనను విమర్శిస్తే..ప్రజల దృష్టి ఉద్యమం వైపు మళ్లుతుందని చెప్పానని వర్మ అంగీకరించాడు. ఈ విషయంలోకి పవన్‌ను లాగినందుకు పవన్‌కు, అతడి అభిమానులకు ఆర్జీవీ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: