నాగశౌర్య నిహారిక నిశ్చితార్ధం పై ప్రముఖ ఛానల్ షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్ళి కూతురుగా మారబోతోంది అంటూ నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. ‘ఒకమనసు’ సినిమా తరువాత నిహారిక హీరో నాగశౌర్యతో ప్రేమలో పడింది అని వార్తలు వచ్చినా ఇప్పటి వరకు ఆ వార్తలు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమతం అయ్యాయి. 

అయితే నిన్న వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన నిశ్చితార్ధం ఈ సమ్మర్ లో జరగబోతోంది అంటూ బ్రేకింగ్ న్యూస్ ను లీక్ చేసింది ఆ ప్రముఖ ఛానల్. అంతేకాదు నాగశౌర్య లేటెస్ట్ మూవీ ‘ఛలో’ హిట్ వెనుక మెగా అభిమానుల పాత్ర ఉంది అన్న కామెంట్స్ కూడ ఆ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యాయి. 

ఈ వివాహా నిశ్చితార్దానికి ఇరు కుటుంబాల అంగీకారం లభించింది అన్న న్యూస్ కూడ ప్రముఖంగా ప్రసారం చేసింది. దీనితో త్వరలోనే మెగా కుటుంబంలో మరో పెళ్లి వేడుకకు రంగం సిద్ధం అవుతోంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవిని ఈ పెళ్లి విషయమై ఒప్పించడంలో నిహారిక నాగశౌర్యలు చాల వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.  

2011లో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య నటించిన సినిమాలు కొన్ని హిట్ అయినా మధ్యలో వచ్చిన ఫ్లాప్ లతో ఈ యంగ్ హీరో కెరియర్ ఇప్పటి వరకు నెమ్మదిగా నడిచింది. అయితే ‘ఛలో’ మూవీ ఊహించని విజయం సాధించడంతో ఈ యంగ్ హీరో తన స్పీడ్ ను మరింత పెంచి ప్రస్తుతం ‘నర్తనశాల’ లో నటిస్తున్నాడు. ‘ఛలో’ ఇచ్చిన సక్సస్ తో ఇప్పుడు నాగశౌర్య ఇప్పుడు ఏకంగా 4 కోట్లు పారితోషికంగా డిమాండ్ చేస్తున్నాడు అన్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరోకి మెగా కుటుంబ ఆశిస్సులు కూడ లభిస్తే రానున్న రోజులలో మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇతడి పారితోషికం మరింత పెరిగి పోయినా ఆశ్చర్యం లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: