అక్షయ్ కుమార్ ఇంటి భోజనం - భగవద్గీత పఠనం అద్భుతం: హీరో విల్ స్మిత్

"భారత చరిత్ర అంటే ఎంతో ఇష్టం, హిందువుల పవిత్ర గ్రంథం, జీవిత సారం అయిన భగవద్గీతను కూడా చదివా" అన్నారు విల్లార్డ్ కారల్ విల్ స్మిత్ అమెరికన్ - హాలీవుడ్ స్టార్ హీరో. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి, అంతర్జాతీయ ఖ్యాతిని కూడా పొందిన విల్ స్మిత్ సోమవారం ముంబై వచ్చాడు. తన తదుపరి సినిమా "బ్రైట్" త్వరలో  విడుదల కానున్న నేపథ్యం లో విల్ స్మిత్ సినిమా ప్రమోషన్ ప్రచారం నిమిత్తం ఇండియా వచ్చాడు. ఈ సందర్భంగా ఇండియాతో తనకున్న అనుబంధం గురించి ఈ హీరో వివరించాడు.


 బాలీవుడ్ నటుల్లో తనకు అక్షయ్ కుమార్ అత్యంత సన్నిహితుడు అని విల్ స్మిత్ చెప్పాడు. అక్షయ్ ఇంట్లో భోజనం చాలా బాగుంటుందని కితాబిచ్చాడు. భారత చరిత్ర చదివాను అని, భారత చరిత్ర చాలా ఆసక్తిదాయకమైనదని అన్నాడు. హిందువు ల పవిత్రగ్రంథం భగవద్గీతను దాదాపు 90శాతం గ్రంథాన్ని చదవటం పూర్తి చేశానని స్మిత్ వివరించాడు. ఆయన అద్భుత నటనకు పరాకాష్ఠ "ది పర్స్యూట్ ఆఫ్ హాపీనెస్స్" మూవీ. నిజంగా చెప్పాలంటే ఇదొక "వ్యక్తిత్వ వికాసం" అని చెప్పొచ్చు. 

 

డిసెంబర్ 22న విల్ స్మిత్ "బ్రైట్" విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం స్మిత్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల న్నింటినీ చుట్టేస్తున్నాడు. విల్ స్మిత్ రచయిత, నిర్మాత కూడా! హాలీవుడ్ లో చాలా శక్తివంతమైన నటుడు. ఈయన హాస్య నటుడు కూడా!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: