ప్రపంచం మెచ్చిన హీరో..సూపర్ స్టార్ రజినీకాంత్..!

Edari Rama Krishna
దక్షన భారత సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా సుపర్ స్టార్ గా పిలుచుకుంటారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన రజినీకాంత్ గతకొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా తన సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.  రజనికాంత్ పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో మరియు పెరిగింది నచికుప్పమ్ గ్రామం, క్రిష్ణగిరి జిల్లా తమిళనాడు.

జిజబాయి మరియు రామోజి రావు కి నాలుగొవ సంతానం రజినికాంత్, తండ్రి కానిస్టెబుల్ రజనికాంత్ తన తల్లిని ఎనిమిది సంవత్సరాల వయస్సు లోనె కోల్పోయాడు.  రజనికాంత్ సినిమాల్లోకి రాకముందు బెంగళూరు కొన్ని రకాల జాబ్స్ చేశాడు అలాగే స్టేజ్ నాటకాల్లో నటించాడు. తర్వత బెంగళూరులో బస్సు కండెక్టర్ జాబ్ చేశాడు. రజనికాంత్ 1973 లో మద్రస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్నేహితుల సహయంతో చేరాడు, అక్కడ ప్రభాకరణ్ ప్రోత్సక సహయం అందించారు.   

సుమారు 190 సినిమాలు తమిళ్, తెలుగు, కన్నడ, మళయాలం, హింది భాషల లో పూర్తి చేశాడు. భాషా, ముత్తు, అరుణచలం, నరసింహ, రోబో, శివాజి, రజినికాంత్ కి మంచి పేరు  తెచ్చిపెట్టిన సినిమాలు.  ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా తన సినిమాలు నడుస్తున్నాయి అంటే ఇప్పటికీ ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. 

తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి ఆయన రావడం ఖాయమని కొందరు, రారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ విషయమై గతంలో అభిమానులతో సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు.  బర్త్ డే సందర్భంగా పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నాన్చుడు ధోరణి పనికిరాదని, ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న రజనీకాంత్ నేడు అందుకు సంబంధించిన ప్రకటన చేయనున్నట్టు చెబుతున్నారు.

రజనికాంత్ భారత అత్యన్నత అవార్డు పద్మ భుషన్ పొందాడు. రజినికాంత్ రచయితగా,నిర్మాతగా మరియు గాయకుడుగా తను నిరుపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన పా రంజీత్ దర్శకత్వంలో ‘కాలా’ చిత్రంలో నటిస్తున్నారు.  నేడు రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఏపీహెరాల్డ్.కామ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: