ఎవరు ఈ గెటప్ లో అంటున్న చెర్రీ...!!

K Prakesh

హీరో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జంజీర్ సినిమాలో ఒక నిజమైన పోలీసు ఆఫీసర్ లాగే కనిపిస్తూ అతడి నడకా ప్రవర్తన బాడీ లాంగ్వేజ్ అంతా ఒక ఒరిజనల్ పోలీసు ఆఫీసర్ గా కనిపించడం బాలీవుడ్ లోని చాలామంది దర్శక నిర్మాతలను ఆకర్షిస్తోందట. ఈ పోలీసు గెటప్ కోసం చెర్రీ తన బాడీని చాల కష్టపడి తీర్చిదిద్దు కున్నట్లు తెలుస్తోంది. పోలీసు దుస్తులలో అందర్నీ ఆకర్షిస్తున్న చెర్రీ ఈ లుక్ రావడానికి రోజుకు నాలుగు గంటలు కష్టపడే వాడట. అంతేకాదు ఆస్ట్రేలియా నుంచి ఫిజికల్ ట్రైనర్ ని రప్పించుకుని అతని సూచనలు మేరకు పోలీసు ఆఫీసర్ నడకా తీరు అన్నీ నప్పేటట్లుగా తన పర్సనాలిటీని మార్చుకున్నాడట.

అంతేకాకుండా ఈ లుక్ కోసం తన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకున్నాడట. అందువలనే ‘జంజీర్’ సినిమాలో తన లుక్ రియల్ పోలీసు ఆఫీసర్ గా ఉంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి అంటూ మురిసిపోతున్నాడు చెర్రీ. అంతేకాదు ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్న అపూర్వ లాఖ్య చెర్రీని ఈ సినిమా ప్రారంభం అయ్యేముందు రియల్ పోలీసు ఆఫీసర్ల బాడీ ల్యాంగ్ వెజ్ ని సునిశితంగా పరిశీలించమని సలహా ఇచ్చాడట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలనే రామ్ చరణ్ లుక్ ‘జంజీర్’ లో అంత బాగా వచ్చింది అని అంటున్నాడు ఈ సినిమా దర్శకుడు అపూర్వ లాఖియ. చివరకు ఈ సినిమా హీరో రామ్ చరణ్ కూడా తన గెటప్ ను చూసి తానే ఆశ్చర్యపోయాడట...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: