డిజె దువ్వాడ జగన్నాధం కు మరో బలమైన షాక్



రాను రాను తెలుగు చిత్ర పరిశ్రమకు సాంప్రదాయం సంస్కృతి అంటే లక్ష్యం లేకుండా నిర్లక్ష్యం అవధులు దాటింది. ముఖ్యంగా వేదవేదాంగాలను, నమక చమకాలను పరిహసించే స్థాయికి చేరి అంగాంగ ప్రదర్శనలకు ఆ పవిత్ర భక్తి గీతాలను, స్తోత్రాలను వాడుకునే వరకు వచ్చింది. బ్రహ్మణులను ఇతర కులాలపై కుల దురహకారం తో సినిమాల్లోను, రాజకీయాల్లోను, సమాజములో ఇతరత్రా అన్నివిధాలా విషం చిమ్మటం జరుగుతుంది. చివరకు న్యాయ స్థానాలలో సవాల్ చేసేవరకు పరిస్థితు లు మారి పోయాయి.

  
   
అల్లు అర్జున్‌ నటించిన దువ్వాడ జగన్నాథమ్‌ (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వీటిని తొలగించేంత వరకు ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్‌ దాఖలు చేశారు. ఇందులో ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరు లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.


ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో పలు అభ్యంతరకర పదాలు ఉన్నాయని పిటిషనర్‌ తెలిపారు. అంతే కాక యజుర్వేదంలోని నమకం-చమకం వంటి పవిత్రపదాలను కూడా ఉపయోగించారన్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు.


ఈ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించా మని వివరించారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించేంత వరకు థియేటర్లలో డీజే ప్రదర్శన నిషేధం విధించేలా ఆదేశాలు జారీచేయాలని కృష్ణమోహన్‌ కోర్టును కోరారు. ఇంతకుముందు బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: