బన్నీ Vs చరణ్: మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య బిగ్ వార్ పక్కా?

Purushottham Vinay
బన్నీ Vs చరణ్: మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య బిగ్ వార్ పక్కా?ప్రస్తుతం మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తున్న స్టార్ ఎవరంటే అల్లు అర్జున్. అందుకు పుష్ప 2 సినిమా ఒక కారణమైతే.. వైసీపీ నేతకు సపోర్ట్ ఇచ్చి అభాసుపాలు కావడమే కాకుండా మెగా ఫ్యామిలీలో విభేదాలకు మరో కారణం కూడా అయ్యారు.వైసీపీ పార్టీ నేతకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో అమీతుమీ తెల్చుకొనేందుకు సిద్దమవుతున్నారు అల్లు అర్జున్. పూర్తి వివరాల్లోకి వెలితే..అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో విడుదలకు ఉన్నారు. ఈ మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కానీ మెగా ఫ్యామిలీతో గొడవ పంచాయితీ కారణంగా ఆ మూవీ రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గారనే విషయం బయటకు వచ్చింది.పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ నిర్ణయం తీసుకోవడంతో పుష్ప 2 సినిమా వస్తే ఆ సినిమాకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వకూడదని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ గట్టిగా డిసైడ్ అయ్యారట. ఆ కారణం వల్లనే పుష్ప 2 సినిమాను రిలీజ్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. 


అందుకే ఆగస్టు 15 న కాకుండా మరో డేట్‌ను సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.ఒకవేళ పుష్ప 2 సినిమా కనుక రిలీజ్ కి వాయిదా పడితే.. సరైన డేట్ ఇప్పట్లో దొరకడం మాత్రం చాలా కష్టమే. దసరా, దీపావళీ పండుగలకు ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు గట్టిగా ఫిక్స్ అయ్యాయి. అయితే ఇక చాయిస్ ఉన్నది మాత్రం ఇయర్ ఎండ్‌లోనే. దాంతో ఈ మూవీని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఇక క్రిస్మస్ పండుగకు లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేసుకొని అదే డిసెంబర్ 20వ తేదీకి రాంచరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దాంతో పుష్ప 2, గేమ్ ఛేంజర్ రెండు బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవుతాయనే అనుమానాలు తలెత్తాయి. ప్రస్తుతం మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్, పుష్ప 2 ఒకే డేట్‌కు రిలీజ్ అయితే ఖచ్చితంగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య రచ్చ మాములుగా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: