యూరప్ లో రేసు గుర్రం పై స్నేహతో బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ మధ్య అతడిపై వస్తున్న రూమర్స్ కు పులిస్టాప్ పెట్టాలని కాబోలు తన భార్య స్నేహారెడ్డి తో యూరప్ టూరులో సరదాగా గడుపుతున్న ఫోటోలు తన అభిమానుల కోసం వెబ్ మీడియాలో అందుబాటులో ఉంచాడు. ప్రస్తుతం బన్నీ తన కొత్త సినిమా ‘రేసు గుర్రం’ సినిమా షూటింగ్ కోసం యూరప్ లో ఉంటూ ఆ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది.
ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్ని ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని ఉం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరప్ లో శృతి హసన్ అనారోగ్యం రీత్యా షూటింగ్ ఆగిపోయి తాత్కాలికంగా బ్రేక్ పడటంతో బన్నీ తన భార్యతో మరింత ఎంజాయ్ చేస్తున్నాడు...