ఆ రికార్డ్ ని కూడ బాహుబలి2 బ్రేక్ చేయనుంది
ఇదిలా ఉంటే బాహుబలి2 మూవీ 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని దాటి....ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ ని బ్రేక్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... బాహుబలి2 విడుదలైన రోజు నుండే వసూళ్ల వేట మొదలుపెట్టి అనేక రికార్డులను క్రియేట్ చేసింది. మొదటి 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 1000 కోట్ల షేర్ ని టచ్ చేసింది. ఇప్పుడు బాహుబలి2 కేవలం ఇండియాలోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ ను దాటిపోయింది.
కేవలం రెండు వారాల్లోనే బాహుబలి2 ఈ విధమైన కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది పెద్ద పెద్ద నిర్మాతలకి సైతం ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటి వరకూ 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో 1600 కోట్ల రూపాయలకి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఎందుకంటే బాహుబలి2 ఇప్పటికే అత్యధిక థియోటర్స్ లో రిలీజ్ అయి...ఇంకా ప్రదర్శనలు జరుపుకుంటుంది. ఇక బాహుబలి2 1600 కోట్ల రూపాయలను టచ్ అయిందటే ఈ రికార్డ్ ని బ్రేక్ చేయటానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో 5 అయిదు సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. 1000 కోట్ల రూపాయలను టచ్ చేయటమే కాకుండా 1600 కోట్లరూపాయల కలెక్షన్స్ ని సైతం టచ్ చేసి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయనుందని అంటున్నారు.