సహజనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఇటీవల మరణించిన నేపధ్యంలో జయసుధ ఈరోజు ఆ మరణం పై స్పందించింది. నితిన్ కపూర్ మరణంపై రకరకాల ఊహాగానాలు గాసిప్పులు మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల ప్రచారం పై ఇప్పటి వరకూ స్పందించని జయసుధ ఈరోజు స్పంధించింది.
అయితే ఈరోజు జయసుధ ఇలా స్పందించడానికి వెనుక ఒక కారణం ఉంది. ఈరోజు జయసుధ-నితిన్ కపూర్ ల పెళ్లి రోజు. 32 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వీరిద్దరూ టాలీవుడ్ లో ఎప్పుడూ ఎటువంటి సంచలనాలు లేకుండా చాల లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తూ వచ్చారు. అయితే ఈరోజు వారిద్దరి పెళ్లిరోజు కావడంతో తన జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ స్పందించింది జయసుధ.
నితిన్ కపూర్ ప్రస్తుతం దేవతలతో ఉన్నారు అని చాలా కాలంగా ఆయన శాంతి కోసం వెతుకుతున్నారు అని ఎట్టకేలకు ఆయనకు కావాల్సింది దొరికింది అంటూ జయసుధ వ్యాఖ్యానించింది. అంతేకాదు డిప్రెషన్ అనేది చాలా తీవ్రమైన మెడికల్ కండీషన్ అంటూ తన జీవితంలో జరిగిన చీకటి సంఘటనను సెన్సేషన్ చేయకుండా సంయమనం పాటించినందుకు మీడియాకి కృతజ్ఞతలు తెలియచేసింది జయసుధ.
తన ఫ్యామిలీ ప్రైవసీ తనకు ముఖ్యం అని అంటూ తన భర్తతో గడిపిన మధుర క్షణాలు తనకు గుర్తుకొస్తున్నాయి అంటూ తన భర్త ఎక్కడ ఉన్నా అతడి ఆత్మ తమ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందని భావిస్తున్నాను అంటూ కామెంట్స్ చేసింది జయసుధ. అంతేకాదు తన భర్త ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను అని అంటూ ఈ విషాద సమయంలో తనకు తన కుటుంబానికి సానుభూతి తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలియ చేసింది జయసుధ.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ముంబాయిలో ఉన్న జయసుధ హైదరబాద్ కు తిరిగి వచ్చిన తరువాత వచ్చిన తరువాత నితిన్ కపూర్ సంతాప సభను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి జయసుధతో నటించిన ఒకనాటి టాప్ హీరోలు ఆసంతాప సభ ఏర్పాట్లలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..