చేతులు కాల్చుకుంటున్న స్నేహ

Prasad
హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఇప్పుడు చేతులు కాల్చుకోవడానికి సిద్దపడుతుంది. హీరోయిన్ గా రాణించిన ఆమె చిత్ర నిర్మాణంలోనూ ప్రవేశించాలని భావిస్తుంది. నూతన నటీనటులు, దర్శకులతో చిత్రాలు నిర్మించాలని స్నేహ భావిస్తుంది. అందుకోసం ఆమె ప్రయత్నాలు ప్రారంభించిది.

వెండితెర మీద రాణించిన నటులు నిర్మాతలుగా మారడం కొత్త కాదు. తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు హిందీ భాషలోనూ ఇలా జరిగింది. అయితే వీరిలో ఎవ్వరూ నిర్మాతలుగా రాణించలేక పోయారు. ముఖ్యంగా నిర్మాతలుగా మారిన హీరోయిన్లు రాణించిన సంఘటనలు గతంలో జరగలేదు. దీంతో  నిర్మాతగా మారుతున్న స్నేహ పెద్ద సాహసమే చేస్తుందని చెప్పుకోవాలి.

కాగా, హీరోయిన్ స్నేహ తమిళ హీరో ప్రసన్నను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: