కోలీవుడ్ లో రాజమౌళి హవా

Prasad
చాలా మంది తమిళ దర్శకులు తెలుగు సినీమా అభిమానుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చకున్నారు. నాటి భారతీరాజీ, బాలచందర్ నుంచి నేటి మణిరత్నం, శంకర్ వరకూ చాలా మంది తమిళ దర్శకులు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. దీంతో వీరి సినిమాలకు మన తెలుగులోనూ మంచి మార్కట్ వుంది. అయితే తెలుగు దర్శకులు ఎవ్వరూ ఆ స్థాయిలో తమిళనాట గుర్తింపు తెచ్చుకోలేక పోయారు. అయితే రాజమౌళి ఆ కొరతను తీరుస్తున్నాడు. తమిళ తంబీల అభిమాన్ని సంపాదించుకుంటున్నాడు. అతని తాజా చిత్రం ఈగ తమిళంలోనూ విడుదల అయింది. అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రాజమౌళి టేకింగ్ వారిని అమితంగా ఆకట్టుకుంటుంది. తమిళనాట రాజమౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ప్రభాస్ హీరోగా రాజమౌళి గతంలో రూపొందించిన చత్రపతి చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి ‘చంద్రమౌళి’ అనే పేరు పెట్టారు. అంతేకాకుండా చంద్రమౌళి పబ్లిసిటీలో కేవలం రాజమౌళి ఫోటోను మాత్రమే ఉపయోగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: