బ్యాంకులను కదిలిస్తున్న రజినీకాంత్ !

Seetha Sailaja
ప్రస్తుతం రజినీకాంత్ ఇండియాలో లేకపోయినా ఆయన ఆరోగ్యం పై రకరకాల గసిప్పులు  ప్రచారంలోకి వస్తున్నా ఆ గాసిప్పుల ప్రభావం ఏదీ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కబాలి’ పై పనిచేయడంలేదు. కోలీవుడ్ మీడియా వ్రాస్తున్న వార్తల ప్రకారం ‘కబాలి’ ఈనెల 29న విడుదల అవుతోంది అని తెలుస్తోంది. ఈసినిమా ప్రమోషన్ ను ఈ సినిమా నిర్మాతలు ఇంకా ప్రారంభించక పోయినా రజినీకాంత్ వీరాభిమానులు అదేవిధంగా అనేక కార్పోరేట్ కంపెనీలు ‘కబాలి’ క్రేజ్ లో మునిగి పోతున్నాయి. 

ఇప్పటికే మలేషియా సింగపూర్ లాంటి దేశాలలో చాలామంది తమ కారు ముందు భాగాలపై ‘కబాలి’ పోస్టర్లు వేసుకునీ మరీ తిరుగుతున్నారు. ఇప్పటికే ఒక విమానానికి ‘కబాలి’ పోస్టర్లు డిజైన్ చేయించి ఒక విమానయాన సంస్థ చేస్తున్న హంగామా అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. తమిళనాడు అంతటా ‘కబాలి’ పోస్టర్స్ ‘కబాలి’ మైనపు బొమ్మలు ‘కబాలి’ కీ చైన్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇది ఇలా ఉండగా సిటీ యూనియన్ బ్యాంక్ తమ ప్లాటినం క్రెడిట్ కార్డలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ పోస్టర్ తో డిజైన్ చేయించడం టాపిక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారిపోయింది. దీనితో రజినీ కాంత్ క్రేజ్ ఒక బ్రాండ్ గా మారిపోవడంతో కార్పోరేట్ కంపెనీలు అన్నీ ‘కబాలి’ చుట్టూ పరిగెడుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలు ఇలా ఉండగా రజినీకాంత్ అనారోగ్యానికి ‘రోబో 2’ కు ఒక సంబంధం ఉంది అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు  వ్రాస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రోబో 2’ షూటింగ్ కోసం రజినీ తన శక్తికి మించిన కష్టపడటమే కాకుండా ఈ సినిమాలో రజినీ వేసుకున్న కాస్ట్యూమ్స్ 40 కేజీలు వరకు ఉండటంతోపాటు ముందు వేసవిలో అవుట్ డోర్ లో మండే ఎండల్లో అంత బరువైన కాస్ట్యూమ్స్ వేసుకుని నటించడం వల్ల రజినీకి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి అని అంటూ కోలీవుడ్ మీడియా మరో కొత్త షాకింగ్ న్యూస్ ను బయట పెట్టింది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: