Money: నిరుద్యోగులకు చక్కటి అవకాశం.. రూ. 50 వేలకు పైగా ఆదాయం..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ.. ఉన్న సమయాన్ని కూడా వృధా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మరికొంతమంది సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారు. చాలా వరకు చదువుకున్న యువత ఇలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులను నేర్చుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి ఒక వృత్తి విద్యా కోర్సు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోర్సు నేర్చుకుంటే ప్రతి నెల రూ .50 వేలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళితే ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారిపోయిన నేపథ్యంలో.. మార్కెట్లోకి కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దాంతో వాటి రిపేర్ కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. మరొకవైపు వర్షాకాలం కారణంగా స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా పాడవతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే స్మార్ట్ఫోన్ రిపేర్ చేసే వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకుంటే ప్రతి నెల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలో మొబైల్ సర్వీసింగ్ కోసం నేర్చుకోవడం వల్ల మీరు ఈ రంగంలో చక్కటి ఆదాయాన్ని పొందవచ్చు.


మొబైల్ సర్వీసింగ్ కోర్స్ కోసం కేవలం ₹.2500 చెల్లిస్తే మూడు నెలల వ్యవధిలో మీకు మొబైల్ రిపేరింగ్ టెక్నిక్స్ ను నేర్పిస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు సొంతంగా మొబైల్ రిపేరింగ్ షాప్ కూడా పెట్టుకోవచ్చు. ఒక ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఈ సర్వీస్ ని అందించవచ్చు. తద్వారా అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాదు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మొబైల్ రిపేరింగ్ కూడా మీరు లైవ్ లో చూపించి అలా కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.జనసామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో షాప్ ఓపెన్ చేసి ఈ వృత్తిని ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: