Money: అదిరిపోయే పోస్ట్ ఆఫీస్ స్కీం.. ఆదాయం పెరగాలంటే..?
అవసరమైనప్పుడు విత్డ్రా ఆప్షన్ తో పాటు మరెన్నో లాభాలను అందిస్తున్న ఈ పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ వడ్డీ రేటు అందించే బెస్ట్ పథకాలను ఒకసారి చెక్ చేయాలి. వాటిలో మొదటిది పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంట్.. ఇది బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది. స్కీం కాలవ్యవధి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు వరకు ఉంటుంది. వడ్డీ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. కాబట్టి మీరు ఆ మొత్తాన్ని ఏటా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే 2023, 2024 రెండో త్రైమాసికానికి వడ్డీ రేట్లు 6.9% ఉండగా రెండు మూడు సంవత్సరాల అకౌంట్లోకి ఏడు శాతం అది ఐదు సంవత్సరాల అకౌంట్ కి 7.5% వడ్డీని అందిస్తున్నాయి.
ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ టెన్యూర్ తో వచ్చే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో మీరు 100 నుంచి నెలవారీగా డిపాజిట్ చేసుకోవచ్చు దీనిలో 6.5% చొప్పున వడ్డీ లభిస్తుంది. వీటితోపాటు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీంలో కూడా మీకు 7.40% వడ్డీ లభిస్తుంది ఇది కూడా ఐదు సంవత్సరాల పథకం కావడం గమనార్హం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో కూడా మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.