మనీ: ఏటీఎం నుంచి మనీ విత్డ్రా చేసేవారికి షాకింగ్ న్యూస్..!

Divya
ఇప్పుడైతే సోషల్ మనీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ గతంలో డబ్బులు విత్ డ్రా చేయాలి అంటే బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఏటీఎంలు బాగా సహకరించాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో విత్డ్రా చేసుకోవాలి అంటే చాలామంది ఇలా ఏటీఎంలనే ఆశ్రయిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసేవారికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసేటప్పుడు పరిమితికి మించి చేసే ఆర్థిక, ఆర్థికేతర సేవలపై ఖచ్చితంగా చార్జీలు విధిస్తాయని బ్యాంకులు కూడా స్పష్టం చేశాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. గత ఏడాది జూన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చార్జీల వసూళ్లకు సంబంధించి జనవరి ఒకటి 2022 నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
దీని ప్రకారం నగదు విత్ డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ.21 చార్జ్ చేస్తున్నాయి బ్యాంకులు.  ఇంతకుముందు 20 రూపాయలు వసూలు చేసేవి. బ్యాంకు వినియోగదారులు ప్రతినెల వారి బ్యాంకు ఏటీఎంలో ఐదు సార్లు ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో మూడు సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. అలాగే నాన్ మెట్రో కేంద్రాల్లోని ఇతర బ్యాంకు ఏటీఎం లలో ఐదు ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. ఇకపోతే ఆగస్టు ఒకటి 2022 నుంచి అన్ని కేంద్రాలలో ఆర్థిక లావాదేవీలపై రూ.17.. ప్రతి ఆర్థికేతర లావాదేవీలకు రూ.6 ఇంటర్ చేంజ్ చార్జీలను విధించడానికి బ్యాంకులకు ఆర్బిఐ అనుమతి ఇచ్చింది.

పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఈ సర్వీస్ ఛార్జీలను వసూలు చేయడానికి ఆర్బిఐ అనుమతి ఇచ్చింది.  ఇకపోతే కస్టమర్లు కలిగి ఉన్న కార్డు రకాన్ని బట్టి కూడా ప్రధాన బ్యాంకులు కార్డులపై వార్షిక చార్జీలను వసూలు చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: