మనీ: నెలకు రూ.20 వేలు పొందాలంటే.. ఇలా పొదుపు చేయాల్సిందే..!!

GVK Writings
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఈ మధ్య కాలంలో తమ ఆదాయానికి తగ్గట్టుగా పొదుపు చేసుకోవడానికి ఎన్నో పథకాలను అమలులోకి తీసుకు రావడం జరుగుతోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి కల్పించడం గమనార్హం. అందుకే అట్టడుగు వర్గాల వారిని మొదలుకొని అత్యంత సంపన్నుల కూడా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెడుతున్న పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి లాభార్జన పొందుతున్నారు. ఇక ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో జీవించాలంటే మాత్రం తప్పకుండా పథకాలలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది.

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా మీరు ప్రతి నెల 20 వేల రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు. ముఖ్యంగా ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల 60 సంవత్సరాలు వచ్చే వరకు మీ డబ్బులకు ఎటువంటి నష్టం ఉండదు. అంతేకాదు మీకు 60 సంవత్సరాలు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకేసారి భారీ మొత్తాన్ని పొందవచ్చు. అలాగే ఈ పథకం  ద్వారా ప్రతి నెలా కూడా కొంత రూపంలో పెన్షన్ కింద  పొందవచ్చు. రిస్క్ ఉండదు అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా అందుతాయి.

సెక్షన్ 80 సి సి డి వన్ బీ లో రూ.50 వేల వరకు మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ లో పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందుకోసం మీరు ప్రతిరోజు 165 రూపాయలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 60 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయంలో విత్ డ్రా చేసుకుంటే 40శాతం డబ్బులు యాన్యుటీ పథకం కింద పెన్షన్ రూపంలో పొందవచ్చు. మీ వయసు 30 సంవత్సరాలు అయితే నెలకు రూ.5 వేల చొప్పున మరో 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మొత్తంగా మీకు రూ.1.13 కోట్లు వస్తాయి. రూ.65 లక్షలకు పైగా మీ చేతికి వస్తే మిగతా రూ. 45 లక్షలు పెన్షన్ కింద పొందవచ్చు. 22 వేల రూపాయలను మీరు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: