మనీ: వరి రైతులకు శుభవార్త.. పెరిగిన నూకల ధర..!!
దాంతో విరిగిన బియ్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో ఒక్కో క్వింటాల్ ధర రూ.2100 కి చేరుకుంది. దక్షిణ , పశ్చిమ, ఆగ్నేయాసియా దేశాలలో మొక్కజొన్న కు ఘనంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక దీంతో మొక్కజొన్నలు కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారడంతో ప్రతి ఒక్కరూ విరిగిన బియ్యాన్ని ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ దేశాలలో పశువులకు , కోళ్ళకు మేతగా మొక్కజొన్నలను ఉపయోగిస్తారు. ఇక వీటి ధర కూడా పెరగడంతో విరిగిన బియ్యాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు.
బంగ్లాదేశ్ , వియత్నం , ఇండోనేషియా , గల్ఫ్ దేశాలలో మొక్కజొన్న కు భారీగా డిమాండ్ పెరగడంతో కోల్కతాకు చెందిన ప్రైవేటు ఎగుమతి కంపెనీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిమల్ బెంగానీ బిజినెస్ లైన్ తో తెలిపారు. యుద్ధం కారణంగా మొక్కజొన్న సరఫరా బాగా దెబ్బతిందని అందుకే ఇండోనేషియా, వియత్నాం కంపెనీలు ఎక్కువగా విరిగిన బియ్యాన్ని డిమాండ్ చేస్తున్నారని స్పష్టం చేశారు. మొక్కజొన్న సీజన్ ముగియడంతో నిల్వలు లేక వీటి ధరలు అమాంతం పెరిగి పోయాయని.. ప్రస్తుతం రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. ఇక వీటికి డిమాండ్ బాగా పెరగడంతో అందరూ నూకల బియ్యంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీంతో రైతన్నలకు ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు.