మనీ: ఎల్ఐసి సరికొత్త ఆఫర్.. ఎలా అప్లై చేయాలి అంటే..?
తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కు చెందినటువంటి హోమ్ లోన్ సంస్థ అయిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తాజాగా విలేజ్ లెవెల్ ఆంట్ర ప్రెన్యూర్ ల ద్వారా తమ కస్టమర్లకు హోమ్ లోన్ ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు. అది కూడా తక్కువ వడ్డీ రేటుకు వినియోగదారులకు హోమ్ లోన్ ఇవ్వడానికి కామన్ సర్వీస్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.. కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్ లు సేవలను అందిస్తున్నారు. ఇక అతి పెద్ద నెట్ వర్క్ లో ఉన్న వీరిని ఉపయోగించుకుని కస్టమర్లకు హోమ్ లోన్ ఇవ్వడానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయం తీసుకుంది.
అది కూడా కేవలం 6.70 శాతం వడ్డీతో హోమ్ లోన్ మొదలవుతుంది. ఇకపోతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కామన్ సర్వీస్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత లోన్ అందివ్వడానికి విలేజ్ లెవెల్ ఆంట్ర ప్రెన్యూర్ లు మొదటి వ్యక్తిగా పనిచేస్తారు. ఇక వీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అందించే లోన్ అగైంట్స్ ప్రాపర్టీ, హోమ్ లోన్ తో పాటు టాప్ అప్ ప్లాన్స్ కూడా అందిస్తారు. హౌసింగ్ లోన్స్ పొందడానికి ఎవరు అర్హులు అంటే ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు , రిటైర్డ్ ఉద్యోగులు , స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా రుణాలను పొందవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి అంటే కస్టమర్లు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి అక్కడ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు , పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్ వంటివి సబ్మిట్ చేసి దరఖాస్తు పూర్తి చేసి వారికి ఇవ్వాలి. ఇక ఈ దరఖాస్తులను విలేజ్ లెవెల్ ఆంట్ర ప్రెన్యూర్ లు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కి చేరవేస్తారు. దరఖాస్తులను , క్రెడిట్ స్కోర్ ను పరిశీలించిన తర్వాత లోన్ మంజూరు చేయడం జరుగుతుంది.