మనీ: కేంద్రం శుభవార్త.. ప్రతీ నెలా రూ.9 వేలు వారి ఖాతాలో..!!

Divya
ప్రతి నెల పెన్షన్ ల రూపంలో కొంత డబ్బు వస్తే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు అని చాలామంది ఆలోచిస్తుంటారు.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు రూపంలో ప్రతి నెలా 2500 రూపాయలు వారి ఖాతా లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈపీఎఫ్ అకౌంట్ కలిగిన వారికి ఇబ్బంది కలగకుండా 60 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత మొత్తంలో జమ చేయాలని ఆలోచిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ₹1000 గా ఉన్న ఈ పెన్షన్ ఏకంగా 9 వేల రూపాయలు గా చేయవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మీరు కూడా ఈపీఎఫ్ ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నారా..? ఇక అంతే కాదు మీరు జమ చేస్తున్న మొత్తంలో కొంత ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో కూడా ఉందని మీకు తెలుసా..? అలాంటి వారికి ఒక శుభవార్త.. ప్రస్తుతం ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షనర్లకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వస్తోంది. మినిమం పెన్షన్ ను ఏకంగా రూ. 9000 చేయాలి అని డిమాండ్లు వస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కనీస పెన్షన్ పెంచేందుకు ఎన్నో రోజుల నుంచి కసరత్తు జరుగుతోంది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు వచ్చే కనీస పెన్షన్ ఫిబ్రవరిలో కేంద్ర ఉపాధి కార్మిక మంత్రిత్వశాఖ చర్చించి నిర్ణయం తీసుకోనుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏమిటంటే పెన్షన్ కనీసం వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు కనీస పింఛను పెంచాలని నిర్ణయం త్వరలోనే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలకు పెంచినట్లు అయితే పెన్షనర్లకు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: