పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన మేనల్లుడు ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా బ్రో. ఇక సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. తమిళంలో సూపర్ హిట్ గానే వచ్చిన వినోదయ సీతం సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా మల్టీస్టారర్ గారు పొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తికాగా మిగిలిన నటీనటుల కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

అయితే పవన్ కళ్యాణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఆ పాట కోసం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ప్రత్యేకమైన పబ్ సెట్ కూడా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. అంతేకాదు ఆ పాట షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉండబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ వార్త విన్న పవన్ అభిమానులు ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని తీసుకుంటారా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ పాట కోసం

 శృతిహాసన్ లేదా దిశా పటానీలను ఫైనల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరి డేట్ దొరికితే అయితే వారిని ఫైనల్ చేస్తారట చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట సముద్రఖని.. ఇదిలా ఉంటే ఇక పవన్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న బ్రో సినిమాలో కేతిక శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా జులై 28న విడుదల కాబోతోంది. దీంతో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: