హెరిటేజ్ ఫుడ్స్ నాది.. చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారు..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
హెరిటేజ్ ఫుడ్స్..ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబు ఫ్యామిలి మాత్రమే.. హెరిటేజ్ ఫుడ్స్ ని ఒక చిన్న సంస్థగా స్థాపించి అతిపెద్ద వ్యవస్థగా మార్చారు.  ఎంతోమందికి ఈ సంస్థ ఉపాధి కల్పించింది.అయితే అలాంటి హెరిటేజ్ ఫుడ్స్ పాలు,పాల సంబంధిత ఉత్పత్తులను విక్రయిస్తూ పెద్ద బిజినెస్ గా ఎదిగింది. అయితే హెరిటేజ్ ఫుడ్స్ అనగానే అందరికీ నారా వారి ఫ్యామిలీనే గుర్తుకు వస్తుంది. ఈ హెరిటేజ్ ఫుడ్స్ ని నారా భువనేశ్వరి చూసుకుంటున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ లో మిగతా భాద్యతలు నారా బ్రాహ్మిణి కూడా చూసుకుంటుంది. అలాగే ప్రకృతి విపత్కర సమయంలో ఎంతోమందికి తమ సంస్థ ద్వారా సహాయ సహకారాలు కూడా అందించారు. 


అయితే అలాంటి హెరిటేజ్ ఫుడ్స్ నాది అని, అందులో మెజారిటీ పెట్టుబడులు నేనే పెట్టానని, కానీ చంద్రబాబు బలవంతంగా లాక్కున్నారు అంటూ ఓ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తనదే అని ఎందుకు  చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ నారా చంద్రబాబు నాయుడుది అని అందరూ అనుకుంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే  అందులో మెజారిటీ పెట్టుబడులు నేనే పెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు మోహన్ బాబు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు హెరిటేజ్ ఫుడ్స్ గురించి స్పందిస్తూ.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ నాదే..


అందులో ఎక్కువ శాతం పెట్టుబడి,మెజారిటీ షేర్లు నావే.. కానీ చంద్రబాబు నా వద్ద నుండి అవి బలవంతంగా లాక్కున్నారు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. అయితే అదే ఇంటర్వ్యూలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా గొప్పగా పొగిడారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలియదు కానీ గతంలో ఈ మాటలు మాట్లాడిన సమయంలో మోహన్ బాబు వైసీపీ పార్టీ లో కీలకంగా ఉన్నారు. అందుకే తమ ప్రత్యర్థి పార్టీ అయినటువంటి చంద్రబాబు సంస్థ పై ఈ విధంగా ఆరోపణలు చేసినట్టు పలువురు భావించారు.మరి నిజంగానే హెరిటేజ్ ఫుడ్స్ మోహన్ బాబు నుండి చంద్రబాబు లాక్కున్నారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: