రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమా బిజినెస్ అదుర్స్..!!

Divya
ప్రముఖ డాన్సర్ గా మాస్టర్ గా నటుడుగా డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు రాఘవ లారెన్స్.. హీరోగా తన నటించిన తాజా చిత్రం రుద్రుడు.. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది విడుదలైన ట్రైలర్ కు కూడా విశేష స్పందన లభిస్తోంది.. పూర్తిస్థాయి లో మాస్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. రాఘవ లారెన్స్ రుద్రుడు సినిమాలో హీరోయిన్ గా ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. శరత్ కుమార్ ,పూర్ణిమ భాగ్యరాజ్ ,నాజర్ కీలకమైన పాత్రలో నటించబోతున్నారు.

తెలుగుతోపాటు తమిళంలో కూడా ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది.. అయితే రుద్రుడు సినిమాకి ఏరియా వైజ్ గా బాగానే అమ్ముడుపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాలలోని థియేటర్ల విషయానికి వస్తే రూ.7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.ఇదంతా చూస్తుంటే  లారెన్స్ కు తెలుగు రాష్ట్రాలలో మంచి క్రేజీ ఉందని అర్థమవుతోంది. కాంచన గంగ స్టైల్ డాన్ సినిమాల ద్వారా సూపర్ హిట్ కొట్టిన రాఘవ ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకున్నారు.

కతిరేసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమా ఆంటోని ఎడిటర్ గా శివ విక్కీ స్టంట్స్ కంపోజ్ చేయడం జరిగింది. ఫైవ్ స్టార్ క్రియేషన్ బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించారు ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది .ఈ సినిమా కూడా మదర్ సెంటిమెంట్తో తెరకెక్కించినట్లు సమాచారం. మాస్ యాక్షన్ డాన్స్ వంటి కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన సినిమాల ఈ సినిమా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే ఈనెల 14వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో రాఘవ లారెన్స్ కు కలిసొస్తుందో చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే గంగా-3 తీయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: