ఈ సంవత్సరం ఇప్పటికే మూడు చిన్న సినిమాల హవా..!

Pulgam Srinivas
కంటెంట్ బాగుండి ప్రేక్షకులను అలరించేల సినిమాను నిర్మించినట్లు అయితే ప్రేక్షకులు అది స్టార్ హీరో నటించిన సినిమానా ... లేక పోతే మీడియం రేంజ్ హీరో నటించిన సినిమానా ... లేక చిన్న హీరో నటించిన సినిమానా  ఏవి పట్టించుకోకుండా సినిమాను చూస్తుంటారు. అలా కొన్ని సందర్భాలలో చిన్న హీరోలు నటించిన సినిమాలు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం గడిచిన అతి కొద్ది కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
రైటర్ పద్మభూషణ్ : సుహాస్ హీరోగా రూపొందిన ఈ చిన్న సినిమా విడుదల అయిన మొదటి రోజు నుండే మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
బలగం : ప్రియదర్శి హీరో గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
రంగ మార్తాండ : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ... రమ్య కృష్ణ ... బ్రహ్మానందం కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను అందుకుంటుంది. ఇలా ఈ సంవత్సరం గడిచిన అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విడుదల అయిన ఈ మూడు చిన్న సినిమాలు మంచి విజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: