"సలార్" ఉత్తర అమెరికా థియేథ్రికల్ హక్కులకు భారీ ఆఫర్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ మూవీ కి రవి బస్ర్ ర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ఇప్పటికే ఈ మూవీ లో నటిస్తున్న కొంత మంది నటీనటులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న ప్రభాస్ ఈ మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... కే జి ఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి భారీ ఆఫర్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క ఉత్తర అమెరికా థియేటర్ హక్కుల కోసం ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఈ మూవీ కి 38 కోట్ల ఆఫర్ చేసినట్లు సమాచారం. కాకపోతే ఇప్పటికీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈ మూవీ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: