మెగా హీరో తో ఆ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన పవన్..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమాలో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇక ఆ సినిమాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు అటు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నాడు పవన్.

 అంతేకాకుండా ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రముఖ కోలీవుడ్ నటుడు సముతిర ఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నారు.  పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో మొట్టమొదటిసారిగా ఈ సినిమా రావడంతో ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈనెల 27 నుండి మొదలుకానుంది అని తెలుస్తుంది. ఇక ఈ నెల 27 నుండి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ సన్నివేశాలు అన్నీ కూడా ఈ సినిమా మొదటి షెడ్యూల్లోనే పూర్తి చేయాలని చిత్రుబృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  సాయి ధరమ్ తేజ్ 2021లో రిపబ్లిక్ సినిమా అనంతరం ఒక సినిమా కూడా చేయలేదు. ఇక తాజాగా  తేజ్ విరూపాక్ష అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.ఆ సినిమాతో పాటు ఇటు వినోదయ సీతం రీమేక్ లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: