మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. సాహసం చేసిన పెంపుడు కుక్క?

praveen
ఈ మధ్యకాలంలో మనుషులపై జంతువులు దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే మనుషులకి జంతువులకి మధ్య పుట్టుకతోనే జాతి వైరం ఉందేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జంతువులలో చిరుత పులులు కూడా ఒకటి. మెరుపు వేగంతో అతి భయంకరంగా వేటాడుతూ ఉంటాయి చిరుతపులులు. అలాంటి చిరుతపులులు ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి కూడా వస్తూ మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లోకి చొరబడుతున్న చిరుతపులను.. దారుణంగా దాడులకు పాల్పడుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా చిరుత పులి దాడులకు సంబంధించిన ఘటనలు అందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయ్. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇది మన దేశంలో కాదు జింబాబ్వే లో జరిగింది.  ఏకంగా మాజీ క్రికెటర్ పై ఒక చిరుత దాడి చేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది.

 జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విటల్ అనే 51 ఏళ్ళ వ్యక్తిపై చిరుత దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి ఆయన ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు శునకం అతన్ని రక్షించింది. చిరుతతో వీరోచిత పోరాటం చేసి ఇక యజమానిని కాపాడుకోగలిగింది ఆ పెంపుడు కుక్క. స్థానిక క్యూమాని ప్రాంతంలో గై ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది అన్నది తెలుస్తోంది.   అయితే ఈ ఘటనలో గై తో పాటు ఇక పెంపుడు శునకం కూడా తీవ్రంగా గాయపడింది. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో అటు పెంపుడు కుక్కతో పాటు ఇక గై కూడా కోలుకుంటున్నాడని అతని భార్య చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: