ఏపీ: కాయ్ రాజా కాయ్.. హాట్ సీట్ల పై వేల కోట్ల బెట్టింగ్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తి పెంచేలా కనిపిస్తున్నాయి.. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ప్రధాన చర్చ ఏమిటంటే వేల కోట్ల రూపాయల బెట్టింగ్ కొనసాగుతొందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి  ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల పైన ఇలాంటివారు కోట్ల రూపాయలు బెట్టింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయం పైన ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.

 వైసిపి నేత జగన్ టిడిపి అధినేత చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ పోటీ చేస్తున్న స్థానాల పైన కూడా భారీగానే బెట్టింగులు కొనసాగుతున్నాయి.. అటు ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికల బెట్టింగ్ హవా ఎక్కువగా కొనసాగుతోంది. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఎన్నికల బెట్టింగ్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గెలుస్తాడా కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం అందుకుంటుందా.. భీమిలిలో గంటా శ్రీనివాస్ గెలుస్తారా రాజంపేటలో మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారా అనే విషయం పైన కూడా ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయట.

గత ఎన్నికలలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం బరిలో దిగుతున్నారు.. అక్కడ గెలుస్తారా మహిళా చేతులో మళ్లీ ఓడిపోతారా అనే విధంగా కడుతున్నారు..చాలామంది పవన్ కళ్యాణ్ ఓడిపోతారని బెట్టింగులు కడుతున్నారు. మరొక విషయం ఏమిటంటే చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి వైసిపి ఎలాంటి ప్రణాళికలు వేస్తోంది. చంద్రబాబు గెలుపు పైన కూడా జోరుగానే బెట్టింగులు కనపడుతున్నాయి.. వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందులలో వచ్చే మెజారిటీ ఎంత అనే విషయం పైన కూడా మరి కొంతమంది బెట్టింగ్ చేస్తున్నారు. మొత్తానికి బెట్టింగ్ రాయుళ్లు సైతం హాట్ సీట్ల పైన బెట్టింగ్ వేస్తున్నారు.. మరి ఎవరు గెలుస్తారనే విషయం పైన చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: