భయం: కూటమికా.. వైసీపీ పార్టీకా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు రోజురోజుకి ఎలా మలుపు తిరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి ఉన్నది.. గత ఐదేళ్ల నుంచి కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండడంతో తన దూకుడుని బాగా చూపించారు జగన్.. గడిచిన కొద్ది రోజుల వరకు సీన్ అలాగే ఉన్నది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారింది.. మొదట ఏపీకి వచ్చినప్పుడు మోడీ కూటమి సభలో మాట్లాడినప్పుడు కూడా జగన్ పేరు ఎత్తకుండానే వెళ్ళిపోయారు.. దీంతో వైసిపి పార్టీకి బిజెపి సహకరిస్తాందని చాలామంది టిడిపి నేతలు నిరుత్సాహంతో ఉన్నారు.
అయితే అనంతపురం జిల్లాకు అమిత్ షా వచ్చిన తర్వాత ఒకసారిగా సీను మారిపోయింది.. అలా అమిత్ షా వెళ్లిన వెంటనే రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా వేపివేయడం జరిగింది. ఇది ఊహించని పరిణామమే అయినప్పటికీ ఇంకా ఎన్నికలకు వారం రోజులు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సహకారం బాగా లభిస్తుందని అనుకున్న జగన్ డీజీపీ పైన వేటు వేయడంతో ఆశ్చర్యపోయారు.. అధికారులను మార్చడం విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు.

అధికారులను మార్చడం వల్ల ఎన్నికలవేళ సక్రమంగా కాకుండా తమకు అనుకూలంగా జరిపేయాల ప్లాన్ చేసుకున్నట్లు కూటమి భావిస్తోంది. కేవలం వైసీపీ పార్టీ పైన నిన్నటి రోజున మోడీ కూడా ఆరోపణలు చేయడం ఇందులో భాగమేనని చంద్రబాబు ఇచ్చిన స్కిట్లు చదివే మోది మాట్లాడారన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని కావాలని అందరిని మార్చేస్తూ ఇల చేస్తున్నారనే విధంగా జగన్ మాట్లాడడం జరిగింది. కేవలం ఈ కుట్రలు చూస్తూ ఉంటే జగన్ పైన కూటమి మొత్తం యుద్ధాన్ని ప్రకటించిన విధంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా బ్రేక్ వేసింది. ఎన్నికల పూర్తి అయ్యేవరకు ఇలాంటి నిధులను విడుదల చేయకూడదని కూడా తెలియజేసింది.. ముఖ్యంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఫీజ్  రిమెంబర్స్ ఇతర పథకాలను కూడా విడుదల చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రైతు భరోసానిధులను విడుదల చేయడానికి అనుమతించింది. ఈ ధోరణిలో చూస్తూ ఉంటే భయం అనేది కూటమికి ఏర్పడిందా లేక వైసిపి పార్టీగా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: