శ్రీకాళహస్తి లో పూజలు చేస్తున్న అనసూయ.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
బుల్లితెరపై స్టార్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ అనసూయ. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె చాలా తక్కువ కాలంలోనే తన అందంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసి స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది. అనసూయకి వయసు పెరుగుతూ వస్తున్నప్పటికీ అందం కూడా వయస్సు లాగే పెరుగుతూ వస్తుంది.యంగ్ హీరోయిన్ల కి ఏమాత్రం తగ్గకుండా తన అందంతో సినిమాలలో కూడా నటిస్తోంది ఈమె. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

 ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా అనంతరం అనసూయ పుష్ప టు సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. అయితే వరుస సినిమా అవకాశాలతో అనసూయ బిజీ కావడం వల్ల జబర్దస్త్ షో మానేయడం జరిగింది. ఇందుకుగాను అనేక రకాల విమర్శలను కూడా ఎదుర్కొంది అనసూయ. అయితే సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటుంది. ఇక తాను షేర్ చేసే పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

అయితే తాజాగా అనసూయ శ్రీకాళహస్తిలో కొన్ని పూజలను చేయించినట్లుగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇందులో భాగంగానే అనసూయ సంప్రదాయ దుస్తుల్లో శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలను చేయించినట్లుగా తెలుస్తోంది. అయితే సాధారణంగా ఎవరైనా కూడా దోషాలు ఉంటే తప్ప శ్రీకాళహస్తిలో పూజలను చేయరు. అయితే అనసూయ ఎందుకు ఈ సమయంలో శ్రీకాళహస్తిలో పూజలు చేయించింది అన్న కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని సంతోషంగా ఉండాలి అని శ్రీకాళహస్తిలో ఈ ప్రత్యేక పూజలను అనసూయ నిర్వహించినట్లుగా తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: