కోడలి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న చిరంజీవి..!?

Anilkumar
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిగా గుర్తింపును అందుకున్న ఈయన స్వయంకృషితో ఇంతటి విజయాన్ని అందుకున్నాడు. ఇందులో భాగంగానే చాలామంది సినీ సెలబ్రిటీలు వారు ఈ ఇండస్ట్రీకి రావడానికి ముఖ్య కారణం చిరంజీవి అని చెబుతూ ఉంటారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇంతటి విజయాన్ని అందుకున్న చిరంజీవి ఎదుగుదలని చూసి చాలామంది ఓరవలేని వారు ఈయన గురించి నెగిటివ్గా కామెంట్లను సైతం చేస్తూ ఉంటారు. ఈయన సిని ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు దశాబ్దాల నుండి కూడా నెగెటివిటీని ఎదుర్కొంటూనే ఉన్నాడు.

ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కూడా స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందడంతో చాలామంది వీరిద్దరికి సంబంధించి చాలా నెగిటివ్గా కామెంట్లను చేస్తూ ఉంటారు. వీరిద్దరూ చేసే సినిమాల గురించి ఎప్పటికప్పుడు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇక ఇందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు  మెగాస్టార్..ఆయన మాట్లాడుతూ గత కొంత కాలం క్రితం  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు తల్లిదండ్రులు ఆబోతున్నారు అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు..

దీని గురించి ఆయన మాట్లాడుతూ.." నా కోడలు తల్లి అయింది అనే మాట విని చాలా ఎమోషనల్ కి గురయ్యాను.. ఇక తను తల్లి కాబోతుంది అన్న విషయం నాకు మూడు నెలల క్రితమే తెలిసింది..అయితే ఇందులో భాగంగానే మూడు నెలల తరువాత ఫ్యాన్స్ కి ఈ విషయాన్ని చెప్తే బాగుంటుంది అని నేను మూడు నెలల తర్వాత చెప్పాను.. దీంతో చాలామంది ఈ విషయానికి గాను కొన్ని కామెంట్లను చేయడం జరిగింది..ఈ సందర్భంగా ఉపాసనని మెన్షన్  చేస్తూ చాలామంది ట్రోల్స్ కూడా చేశారు.. అవన్నీ చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది..ప్రతి ఒక్కరి జీవితంలోనూ వ్యక్తిగత కారణాలు ఉంటాయి.. కొన్ని కారణాల వల్ల పిల్లల్ని కనాలి అని నిర్ణయాన్ని ఆపుకోవాల్సి వస్తుంది.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి సంఘటనలు ఉండనే ఉంటాయి.. కానీ సినీ సెలెబ్రిటీల జీవితంలో ఇలా అయితే మాత్రం చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.. "అంటూ తన కోడలు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు చిరంజీవి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: