బాబు వారసత్వం: ఆగస్టులో రేవంత్‌కు పదవీ గండం?

తెలంగాణలో రైతుల రుణమాఫీ వ్యవహారం సవాళ్లు, ప్రతి సవాళ్లకు తెరలేపింది. ఏకంగా రాజీనామాలు, పార్టీలు రద్దు చేయాలనే డిమాండ్ వరకు వెళ్లింది. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అయితే ఇప్పుడు బీజేపీ ఒక సరికొత్త వాదనకు తెర లేపింది. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అని.. ఆయన తన పదవిలో ఆగస్టు వరకే ఉంటారని  పేర్కొంటున్నారు. ఆ తర్వాత సీఎం పదవిని కోల్పోతారు అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. తద్వారా ప్రజల్లో ఒకరకమైన భావనను తీసుకొచ్చేందుకు కాషాయ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలిస్తే.. ఆ తర్వాత రాష్ట్రంలో ఎలాగైన అధికారంలోకి వస్తుంది అనే ఒక ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందులో బీజేపీ సఫలీకృతం అయినా ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిని బలవంతుడిని కూడా చేస్తోంది.

ఎందుకంటే మొన్నటి వరకు సీఎం ను విమర్శించిన కోమటిరెడ్డి సోదరులు.. ఇప్పుడు రేవంత్ ను ఆకాశానికెత్తుతున్నారు. కుడి భుజం, ఎడమ భుజంగా ఉంటామని మమ్మల్ని ఎవరు టచ్ చేస్తారో చూస్తాం అని మాట్లాడుతున్నారు. రేవంత్‌ను టార్గెట్ చేస్తున్న కొద్దీ జగ్గారెడ్డి, వీహెచ్ వంటి నేతలు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఒత్తిడులు, బెదిరింపులు ఎక్కువయ్యే కొద్దీ కాంగ్రెస్ కు అండగా.. రేవంత్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేదు. అర డజన్ కు పైగా సీఎం క్యాండిడేట్లు ఉన్నారు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు ఆగస్టు తర్వాత, సెప్టెంబరు తర్వాత, పూర్తి కాలం పాటు ఐదేళ్లు  ఈ ప్రభుత్వం అధికారంలో ఉండదు అని  చెప్పే క్రమంలో కాంగ్ఎస్ పార్టీని ఏకతాటిపైకి వీళ్లే తీసుకువస్తున్నారు. రేవంత్ ని లక్ష్యంగా విమర్శలు చేసి.. ఆయన్ను మరింత బలవంతుడిని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: