ఎన్టీఆర్ 30 వ మూవీ నుండి ఆ అప్డేట్ రాబోతుందా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోటుంది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి 2023 వ సంవత్సరం నుండి మొదలు పెట్టబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని దర్శకుడు కొరటాల శివ మెడికల్ మాఫియా నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అత్యంత భారీ తారాగణంతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి చిత్ర బంధం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఆ మధ్యన ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ... ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మనకు తెలిసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జాహ్నవి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా ఆల్మోస్ట్ కంఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: