ఆ సినిమాతో తన స్టార్డమ్ ను పోగొట్టుకున్న నయనతార..!?

Anilkumar
స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక స్టార్డంను పొందిన నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా వరుస సినిమాలలో నటించింది ఈమె. దాని అనంతరం విగ్నేశ్ శివన్ తో ఇటీవల పెళ్లి జరిగిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది.దాని అనంతరం పెళ్లయిన కొన్ని నెలల వ్యవధిలోని వీరిద్దరూ కవలలకి తల్లిదండ్రులు అయ్యారు. ఇక దానికి గాను అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంది నయనతార. ఇప్పటికీ దానికి సంబంధించిన వార్తలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది నయనతార. 

అంతేకాదు దీనికి గాను సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు నెగెటివిటీని అందుకుంటుంది ఈమె. ప్రస్తుతం వరుస వివాదాలలో చిక్కుకున్న నయనతార ఇటీవల తను ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.ఇక తమిళంలో అయితే ఈ సినిమా అసలు అడ్రస్ లేకుండా పోయింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని విగ్నేశ్  నిర్మించడం జరిగింది. ఇక వీరిద్దరూ కవలలకి తల్లిదండ్రులు అయిన తర్వాత విగ్నేష్ శివన్ నిర్మించిన మొదటి సినిమా ఇది. అలాగే నయనతార కూడా మొదటి సినిమానే.గతంలో ఎన్నడు లేని విధంగా

 ఈ సినిమా కోసం కష్టపడింది నయనతార. దాంతో పాటు ఎన్నడు లేని విధంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా పాల్గొంది. ఈ సినిమాకి నయనతార విగ్నేష్   భారీ స్థాయిలో ఖర్చు చేశాడు. ఇక ఆ ఇంటర్వ్యూలలో భాగంగా గతంలో తన మీద వచ్చిన రూమర్లు మరియు వార్తలపై కూడా స్పందించింది ఈమె.ఎన్నడూ లేని విధంగా ఇంటర్వ్యూలలో మరియు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో ఈమె భాగమైనప్పటికీ ఈ సినిమా మాత్రం హిట్ కాలేక పోయింది. నయనతార అనేక సినిమాలలో నటించినప్పటికీ ఇలాంటి ఫ్లాప్ మాత్రం ఏ సినిమా అవలేదు అని... నయనతార ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా నయనతార ఇమేజ్ను డామేజ్ చేసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఈ సినిమాతో తన స్టార్ స్టేటస్ ను నయనతార పోగొట్టుకుంది అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: