వచ్చి రాగానే అందాలను చూపిస్తున్న రష్మిక..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక స్టార్ హీరోయిన్లలో ఒకరిని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ , కోలీవుడ్ ,కన్నడ సినీ పరిశ్రమలో కూడా తన హవా కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో కూడా రష్మిక ఎక్కువగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది తాజాగా హైదరాబాదులో ఉన్న రష్మిక వచ్చి రావడంతో తెలుగు ఆడియన్స్ కు తన అందాల కనువిందు చేసేలా కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా రష్మిక జాకెట్ విప్పేసి మరి కెమెరా ముందు చిలిపి ఫోజులు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. రష్యా నుంచి వచ్చి రావడంతో ఇలా హాట్ ట్రీట్ ఇవ్వడంతో నేటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా బ్లాక్ జాకెట్ ధరించిన రష్మీ క ఒక లేడీ షో రూమ్ లో డ్రస్సులు చూస్తూ కనిపించింది. ఈ సందర్భంగా కెమెరాకు కొన్ని ఫోజులు కూడా ఇవ్వడం జరిగింది.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి. రష్మిక పుష్ప సినిమా ప్రమోషన్ల కోసం రష్యాకు వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ ,దేవిశ్రీప్రసాద్ తో పాటు నిర్మాతలు కూడా వెళ్లారు. నిన్నటి రోజున పుష్ప సినిమా అక్కడ థియేటర్లలో విడుదలైంది. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పూర్తి చేసుకొని తాజాగా ఇండియాకి చేరుకుంది రష్మిక.
ఈ సందర్భంగా రష్మికపై ట్రోల్స్ మిమ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కనడ చిత్ర పరిశ్రమ గురించి రష్మిక మాట్లాడకపోవడంతో ఆమెను బ్యాన్ చేశారని వార్తలు కూడా వైరల్గా మారాయి. వీటిపై స్పందించిన రష్మిక తనని బ్యాన్ చేస్తున్నారనే వార్తలు ఎలాంటి నిజం లేదని విషయాన్ని తెలియజేసింది. అలాగే కాంతార చిత్రం పై కూడా పలు విషయాలను తెలియజేసింది. ఇక ఇదే సమయంలో తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల పైన పలు రూమర్లు వినిపించాయని నటిగా తన సినిమాలపైనే నేను స్పందిస్తానని పర్సనల్ విషయాల పైన స్పందించాల్సిన అవసరం లేదని తెలియజేసింది రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: