నటుడు జగపతి బాబు అనారోగ్యం వార్తా నిజమేనా..!!

murali krishna
ఒక్కప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగిన జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ బాగా పరిచయమే మరీ. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఎక్కువగా హీరోగా నటించిన జగపతిబాబు ఈమధ్య విలన్ పాత్రలో కూడా  తెగ నటిస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు అని చెప్పొచ్చు.కెరీర్ మొదట్లో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేశాడు. తొలిసారిగా 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జగపతిబాబు. ఆ తర్వాత గాయం, జాబిలమ్మ పెళ్లి, దొంగాట వంటి ఎన్నో సినిమాలలో నటించి  తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే గతంలో కొంతకాలం సినిమాలకు  చాలా దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ తో అడుగు పెట్టి కొత్తకొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నటుడు జగపతి బాబు. చాలావరకు నెగిటివ్ పాత్రలతో కనిపించాడు. ఇక హీరో కంటే ఎక్కువగా విలన్ పాత్రలలో మరింత గుర్తింపు తెచ్చుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు ఈ నటుడు, ప్రస్తుతం వరుస సినిమాలలో  చాలా బిజీగా ఉన్నాడు.ఇక జగపతి బాబుకు ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా అభిమానులుగా ఉన్నారు. ఈయనతో నటించిన చాలామంది నటీనటులు ఈయన గురించి ఎంతో అద్భుతంగా చెబుతుంటారు. అప్పట్లో ఈయన వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచాడు. ఈ మధ్య జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు./br>
అప్పుడప్పుడు కొన్ని విషయాలు పంచుకుంటూ ఉంటాడు. సరదాగా తను చేసే విన్యాసాలను కూడా పంచుకుంటూ ఉంటాడు. ఇక ఆయన సినిమాల గురించి అప్డేట్లను మరికొన్ని విషయాలను  ఎక్కువుగా పంచుకుంటూ ఉంటాడు జగపతిబాబు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక వీడియో పంచుకున్నాడు.అందులో తను 60 ఏళ్ల తర్వాత కాఫీ పెట్టడం నేర్చుకున్నాను అంటూ.. దానిని తయారు చేస్తూ చూపించాడు. అయితే ఆ వీడియోను ఇన్ స్టా వేదికగా పంచుకుంటూ.. ఈ మధ్యన తనకు విస్కీ, రమ్, బ్రాండీ, చెత్తాచెదారం అన్ని ఇవే అంటూ తను చేసిన కాఫీని చూపించాడు. ఆ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది ఇక ఇదంతా ఆయన తన ఆరోగ్యం కోసం చేసుకుంటున్నట్లు మనకు అర్థమైంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. అయ్యో పాపం.. సార్ కి ఎంత కష్టం వచ్చింది అంటూ కామెంట్లు  ఇలా పెడుతున్నారు. మరికొందరు ఈ వయసు వచ్చేవరకు కూడా మీరు కాఫీ పెట్టడం నేర్చుకోలేదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు.. గతంలో ఆయన నటించిన ఓ సినిమా పేరు చెబుతూ ఆ సినిమాలో కాఫీ పెట్టారు కదా అంటూ ఇప్పుడేంటి కొత్తగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అలా కామెంట్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఇక ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టులలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: