మళ్లీ బాలీవుడ్ ను బతికించిన సౌత్ ఇండియన్ మూవీ..!

Divya
ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా సరే కంటెంట్ సరిగ్గా లేక డిజాస్టర్ పాలవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలను హిందీలో డబ్ చేస్తూ అక్కడ కలెక్షన్స్ రాబడుతున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలీవుడ్ ఇండస్ట్రీని సౌత్ ఇండియన్ మూవీ బతికించిందని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే.. మోహన్ లాల్ హీరోగా దృశ్యం సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దృశ్యం 2 కూడా అటు మలయాళం, ఇటు తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది.
అలా అజయ్ దేవగన్,  టబూ, శ్రియా శరన్ కీలక పాత్రలో నటించి తెరకెక్కించిన డబ్ మూవీ దృశ్యం 2 థియేటర్లలో విడుదలై భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అంతేకాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుండడం చూసి బాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోందని చెప్పవచ్చు. దృశ్యం2 రికార్డు బాక్సాఫీస్  దగ్గర 2వ రోజున రూ.21.59కోట్ల పాన్ ఇండియా కలెక్షన్‌ను రాబట్టింది . మళ్లీ దక్షిణ భారత రీమేక్‌తో బాలీవుడ్‌ బ్రతికిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు దాదాపు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సాధించలేదు.  అంతేకాదు బాలీవుడ్ బడా హీరోలు సైతం సినిమాలను తెలుగు హీరోలకు పోటీగా దింపినప్పటికీ అంచనాలను కూడా అందుకోలేకపోయాయి.
ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ ఇండియన్ మూవీల రీమేక్ పై దృష్టి సారించడంతో ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు అక్కడ రీమేక్ అవుతూ భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దృశ్యం 2 సినిమా కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ కి కొంచెం వూరట కలిగించిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: