ఫైనల్ గా సినిమా ఒకే చేసిన అజయ్ భూపతి!!

P.Nishanth Kumar
కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఓ కొత్త దర్శకుడు కొత్త నటీనటులు కలసి చేసిన ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా మంచి విషయమే. చాలామంది ఈ సినిమా విజయం పట్ల ఆనందా న్ని వ్యక్తపరిచారు. ప్రేక్షకులు అబ్బురపడే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉండగా దర్శకుడికి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఆ విధంగా మంచి కథ కథ నాలను అందించిన దర్శకుడు అజయ్ భూపతి తెలుగులో మంచి దర్శకుడుగా ఎదుగుతాడని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు.

కానీ ఆయన తన రెండవ సినిమా కోసం ఎక్కువ సమయాన్ని తీసుకోవడం సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆనందింపలేదు. ఫైనల్ గా ఎక్కువ సమయాన్ని తీసుకుని మహాసముద్రం అనే సినిమాను ఆయన చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఏదైనా కూడా ఈ సినిమా యొక్క ఫ్లాప్ తాలూకు ప్రభావం మొత్తం కూడా ఈ దర్శకుడు పైనే పడింది. దాంతో అజయ్ భూపతి కి సినిమా అవకాశాలు ఇచ్చే హీరోలే కరువయ్యారని చెప్పాలి.

తాజాగా ఆయన ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఆర్ఎక్స్ 100 లాంటి సినిమాగా ఉండబోతుందట. ఈ చిత్రం తప్పకుండా తనకు విజయాన్ని తీసుకువచ్చి మళ్లీ ఫామ్ లోకి తీసుకు రాబోతుంది అని ఆయన నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. కథ విషయంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు అజయ్ భూపతి. అయితే అదే లోపిస్తే మాత్రం ఆయనకు మహాసముద్రం లాంటి ఫ్లాప్ తప్పకుండా కలుగుతుంది. మరి ఈ సినిమా లోనైనా ఆయన ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: