హిందీలో ఆ తేదీ నుండి "ఓటిటి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సీత రామం మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి  హను రాగవపూడి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హను రాఘవపూడి "అందాల రాక్షసి" మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి , ఆ తర్వాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ , లై , పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హను రాఘవపూడి , దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా  సీతా రామం అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యి ,  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సీతా రామం మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభించాయి.  ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా విడుదల అయింది. ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" రిలీజ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ హిందీ వెర్షన్ "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ హిందీ వర్షన్ ను నవంబర్ 18 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: