సుకుమార్ తో రామ్ చరణ్ మూవీ..!!

Divya
రామ్ చరణ్ డైరెక్టర్ రాజమౌళి ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాపులారిటీ సంపాదించింది . ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ,శంకర్ డైరెక్షన్లో RC- 15వ సినిమా లో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తూ ఉన్నది. ఇక ఈ చిత్రంలో మరొక హీరోయిన్ అంజలి కూడా నటిస్తోంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుకు సంబంధించి పలు ఫోటోలు కూడా ఈ మధ్యకాలంలో చాలా లీకై వైరల్ గా మారాయి.
ఈ సినిమాలో కీలకమైన ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్న నూరు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.  ఈ సినిమా  భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇదంతా ఇలా ఉంటే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిన రామ్ చరణ్ కన్నడ డైరెక్టర్ నార్తన్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

దీంతో రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్టు తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం డైరెక్టర్ సాయి సిరీస్ ఊహించని అప్డేట్ ను అందించి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. rrr సినిమా రిలీజ్ కి ముందే రామ్ చరణ్ సుకుమార్తో సినిమాని మొదలు పెట్టారని ఇందుకోసం పదినిమిషాల ఫుటేజ్ను కూడా చిత్రీకరించారని తెలియజేశారు. అయితే సుకుమార్ మాత్రం ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ కోసం రామ్ చరణ్ అదే తరహాలో పూర్తి ఫిట్నెస్ తో కనిపిస్తేనే కంటిన్యూ చేస్తానని సుకుమార్ చెప్పారని సాయి సీరిల్ స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: