నాగ చైతన్య ఆ జోలికి వెళ్లకపోవడమే మంచిది!!

P.Nishanth Kumar
అక్కినేని నాగచైతన్య హీరోగా ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విష యం తెలిసిందే. ద్వి భాష చిత్రంగా తెరకక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన బం గార్రాజు సినిమా కంటే భారీ స్థాయి లో విజయాన్ని ఈ సినిమా అందుకుపోతుంది అని జోస్యం చెబుతున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. ఏదేమై నా అక్కినేని నాగచైతన్య ఊపిరి లాంటి భారీ ఫ్లాప్ సినిమా తర్వాత ఈ దర్శకులతో సినిమా చేయడం విశేషం.

వాస్తవానికి నాగచైతన్య ప్రేమ కథ సినిమాలకు చాలా ఫేమస్. మొదటి నుంచి అలాంటి తరహా సినిమాలు చేసి యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. లవర్ బాయ్ గా అమ్మాయిల మనసులలో ముద్ర వేసుకున్న అక్కినేని నాగచైతన్య ఇకపై అలాంటి జోనర్ సినిమాలు తెరకెక్కించకపోవడమే మంచిది అని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. దానికి కారణం అలాంటి సినిమాలలో అక్కినేని నాగచైతన్య నటించిన కూడా అవి విజయాలు అందుకోకపోగా ఆయనకు ఉన్న ముద్రను తగ్గిస్తుంది అని చెబుతున్నారు. ఆయనతో పాటు సినిమా పరిశ్రమలోకి వచ్చిన చాలామంది హీరోలు మొదట్లో ప్రేమ కథ సినిమాలను చేశారు కానీ ఆ తర్వాత యాక్షన్ సినిమాలను చేసి హీరోలుగా మరొక మెట్టు ఎక్కారు.

కానీ నాగచైతన్య మాత్రమే ఇంకా ప్రేమకథ సినిమాలలో చేయడం వారికి ఏ మాత్రం నచ్చటం లేదు. దానికి తోడు ఆ సినిమాలు మంచి ఫలితాలను ఇవ్వకపోవడం ఆయన అలాంటి సినిమాలు చేయకపోతే మంచిది అని వారు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వెరైటీ సినిమాలు చేసే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా తప్పకుండా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని భావిస్తున్నారు. మరి వారు చెప్పే ఈ విషయం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: