RC15 ఫస్ట్ లుక్ పోస్టర్.. ఎప్పుడంటే..?

Anilkumar
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు...టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.ఇదిలావుంటే ఇక ఇప్పుడు రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం మరియు టైటిల్ కోసం మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.అయితే ఇక తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ పరీక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

అంతేకాదు  సౌత్ లోనే దిగ్గజా దర్శకుడిగా పేరు దక్కించుకున్న శంకర్ ఈ సినిమా తో ఒక అద్భుతమైన సక్సెస్ ని టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అందించబోతున్నాడు అంటూ ఆయన అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.ఇదిలావుంటే ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది, ఆ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ని అనౌన్స్ చేసే విషయమై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఇకపోతే విడుదల తేదీ కూడా దగ్గర పడుతుంది. అయితే ఈ సమయంలో విడుదలకు సంబంధించిన హడావుడి చేయాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ ని రివిల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతుంది.ఇక ఒకటి రెండు వారాల్లోనే ఈ విషయమై క్లారిటీ వస్తుందని మెగా అభిమానుల నుండి సమాచారం అందుతుంది.కాగా  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో వైపు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో సినిమాకు ఇప్పటికే ఒకే చెప్పాడు. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం అందుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: