అందరూ ఒకలా.. గిల్ మరోలా.. ఇంతకీ ఏమన్నాడంటే?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కడా లేని ఒక రూల్ అటు ఐపీఎల్ లో కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూట్. ఇంటర్నేషనల్ క్రికెట్లో సాధారణంగా ఒక ఆటగాడు గాయపడినప్పుడు.. అతనికి సబ్ స్టిట్యూట్ గా మరో ఆటగాడిని మైదానంలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇలా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అయితే ఐపీఎల్ లో మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ ని తీసుకువచ్చి సబ్స్టిట్యూట్ అనే రూల్ కి మెరుగులు దిద్దింది బీసీసీఐ. ఇక ఈ రూల్ కింద బౌలర్ ని లేదా బ్యాట్స్మెన్ ని మ్యాచ్ మధ్యలో మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ బ్యాటింగ్ బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

 అయితే గత కొంతకాలం నుంచి ఈ రూల్ పై తెగ చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ రూల్ కారణంగా ఎంతో మంది ఆల్రౌండర్లకి అన్యాయం జరుగుతుంది అంటూ మాజీ ప్లేయర్లతో పాటు ప్రస్తుత ప్లేయర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రూల్ వల్ల ఆల్రౌండర్లు కేవలం బ్యాటింగ్ కి మాత్రమే పరిమితం అవుతున్నారని తర్వాత బౌలింగ్ చేసేందుకు అవకాశం రావడం లేదు అంటూ చెబుతున్నారు. అందుకే ఈ రూల్ ను తీసేయాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అని చెప్పాలి. అయితే అందరూ ఇలా అభిప్రాయపడితే గిల్ మాత్రం మరోలా స్పందించాడు.

 ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే దీనికి కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్  అంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ల రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తుంది. వాళ్లున్నారనే ధైర్యంతోనే బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు అంటూ గిల్ చెప్పుకొచ్చాడు. అయితే పలువురు సీనియర్ ఆటగాళ్లు ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇక గిల్ మాత్రం మరోలా స్పందించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: