మ్యాచ్ ఓడినా.. సన్రైజర్స్ అరదైన రికార్డ్?

praveen
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పై ఒకప్పుడు ఎవరికి పెద్దగా అంచనాలు ఉండేవి కాదు. ఇక టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సన్రైజర్స్ బాగా రాణిస్తుంది అని నమ్మకం కూడా చాలా మందిలో ఉండేది కాదు. ఎందుకంటే కేవలం బౌలింగ్ విభాగంలో మాత్రమే పటిష్టంగా కనిపించే సన్రైజర్స్.. బ్యాటింగ్లో మాత్రం తేలిపోతూ ఉండేది. కానీ 2024 ఐపీఎల్ సీజన్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా మహా మహా జట్లను సైతం వణికించే విధంగా సన్రైజర్స్ పటిష్టంగా మారిపోయింది.

 ఒకరకంగా బ్యాటింగ్ ఊచకోత అంటే ఎలా ఉంటుందో ఈ సీజన్లో సన్రైజర్స్ బ్యాటర్లు చూపిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లు ఎందుకు బౌలర్లం అయ్యామా అని బాధపడే విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఏకంగా వీర విహారం చేస్తూ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేస్తూ ఉన్నారు. సన్రైజర్స్ ఆటగాళ్ల ఆట తీరు మందు ఇక టి20 ఫార్మాట్లో ఉన్న అన్ని రికార్డులు దాసోహం అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే ఐపీఎల్  హిస్టరీలో అత్యధిక పరుగుల రికార్డును హైదరాబాద్ జట్టు రెండు సార్లు బద్దలు కొట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ లోను ఇలాంటి ఆట తీరును కొనసాగిస్తుంది. అయితే ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో కాస్త తడబడిన హైదరాబాద్ జట్టు ఓటమి చూసింది.

 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయినప్పటికీ అటు అరుదైన రికార్డు మాత్రం ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో ఏకంగా ఇప్పటివరకు 100 సిక్సర్లు బాదేసింది సన్రైజర్స్. ఇలా ఒక ఐపిఎల్ సీజన్లో ఇలా 100 సిక్సర్లు బాధటం ఆ జట్టుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకు ముందు 2022లో 97 సిక్సర్లు, 2016లో 89 సిక్సర్లు, 2018లో 88 సిక్సర్లు బాదింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇంకా మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో  ఇక ఈ సిక్సర్ల సంఖ్య ఎంతవరకు చేరుకుంటుంది అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది. కాగా ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: